భారీ వర్షాలు.. యథాతథంగా యూఏఈ-భారత్ విమాన సర్వీసులు..!!
- May 22, 2025
యూఏఈ: గత కొన్ని రోజులుగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరే కొన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాలపై ప్రభావం పడింది. అయితే, యూఏఈ, భారతదేశం మధ్య విమానాలు మాత్రం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి.
యూఏఈకి చెందిన విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లైదుబాయ్ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత వాతావరణ ప్రతికూలత తమ విమాన సర్వీసులపై ప్రత్యక్ష ప్రభావం చూపదని అన్నారు.
మరోవైపు, ఇండియా వ్యాప్తంగా రుతుపవనాలకు ముందు వర్షాలు కురుస్తున్నాయి. న్యూఢిల్లీ, పూణే, గోవా, బెంగళూరు వంటి ప్రధాన నగరాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.
ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ బెంగళూరులోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







