క‌ల‌రా నియంత్ర‌ణ‌ వ్యాక్సిన్ త‌యారీ చేసిన బయోటెక్

- May 22, 2025 , by Maagulf
క‌ల‌రా నియంత్ర‌ణ‌ వ్యాక్సిన్ త‌యారీ చేసిన బయోటెక్

హైదరాబాద్: హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ మరోసారి చరిత్ర సృష్టించింది.ఇప్పటికే కొవిడ్-19 వైరస్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చింది. భారత్ తోపాటు ప్రపంచ దేశాలకు సరఫరా చేసి ఔరా అనిపించింది. కొవాగ్జిన్ తో పాటు..హెచ్1ఎన్1 వైరస్ కు వ్యాక్సిన్, డెంగ్యూ, రోటా వైరస్, జపనీస్ ఎన్ సెఫలైటిస్, రేబీస్, టైఫాయిడ్.. లాంటి వ్యాధులకు టీకాలు అభివృద్ది చేసింది. ప్రపంచ దేశాల వ్యాక్సిన్ తయారీ సంస్థలకు భారత్ బయోటెక్ దిక్సూచిగా నిలిచింది.అయితే తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది భారత్ బయోటెక్ కలరా నియంత్రణ కోసం సంస్థ కొత్తగా హిల్ కాల్ అనే టీకాను అభివృద్ధి చేసింది. తాజాగా ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు విజయవంతం అయ్యాయి. దీంతో త్వరలోనే ఈ హిల్ కాల్ వ్యాక్సిన్ మార్కెట్ లోకి రానుంది.

కలరా నియంత్రణ కోసం హిల్ కాల్ అనే కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది భారత్ బయోటెక్. ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షల్లో సక్సెస్ అయింది. కలరాను వ్యాప్తి చేసే ఒగావా, ఇనబా సెరో టైప్ బ్యాక్టీరియాలను నియంత్రించడంలో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసినట్లు క్లినికల్ ట్రయల్స్ లో తేలిందని భారత్ బయోటెక్ సంస్థ పరిశోధకులు తెలిపారు.

కలరాను నియంత్రించే హిల్‌ కాల్‌ టీకా ప్రత్యేకత ఏంటంటే..నోటి ద్వారా తీసుకునే కలరా టీకా(ఓరల్‌ కలరా వ్యాక్సిన్‌)ఇది.ఈ వ్యాక్సిన్ ద్వారా కలరా మహమ్మారి నుంచి పెద్దలు, పిల్లలను కాపాడుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు కలరా వ్యాధిని హిల్ కాల్ వ్యాక్సిన్ ద్వారా అదుపు చేయొచ్చని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల తాజాగా వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com