బ్యాచిలర్ హౌసింగ్‌.. కువైట్ మునిసిపాలిటీ కఠిన చర్యలు..!!

- May 22, 2025 , by Maagulf
బ్యాచిలర్ హౌసింగ్‌.. కువైట్ మునిసిపాలిటీ కఠిన చర్యలు..!!

కువైట్: రుమైథియా, సల్వా, సల్మియాలోని ఐదు ఆస్తులకు విద్యుత్తును కువైట్ మునిసిపాలిటీ నిలిపివేసింది. నివాస ప్రాంతాలలో అక్రమంగా నివాసం ఉంటున్న బ్యాచిలర్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. హవల్లి గవర్నరేట్లోని ఇంజనీరింగ్ ఆడిట్, ఫాలో-అప్ విభాగం నేతృత్వంలో విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖల అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ తనిఖీ క్యాంపెయిన్ కొనసాగుతున్నది. ఇలాంటి ధోరణులను అరికట్టడంలో సహాయపడటానికి అందరూ సహకరించాలని కోరారు. మునిసిపాలిటీ హాట్లెన్ 139, వాట్సాప్ 24727732 ద్వారా లేదా స్థానిక మునిసిపల్ శాఖకు ఫిర్యాదు చేయాలని కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com