అల్‌ అయిన్‌లో సామూహిక వివాహాలు

- July 11, 2016 , by Maagulf
అల్‌ అయిన్‌లో సామూహిక వివాహాలు

బని కాబ్‌ ట్రైమ్‌ మరియు ఇతర ట్రైబ్స్‌కి సంబంధించిన 160 జంటలు సామూహికంగా ఒకే చోట వివాహ వేడుకల్ని జరుపుకున్నాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ మరియు మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ షేక్‌ సైఫ్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, మినిస్టర్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ నాలెడ్జ్‌ డెవలప్‌మెంట్‌ షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌, పలువురు షేక్స్‌, సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. అల్‌ అయిన్‌లోని అల్‌ ఖుబైసి వెడ్డింగ్‌ హాల్‌లో ఈ సామూహిక వివాహ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని షేక్‌ సైఫ్‌ బిన్‌ జాయెద్‌ చెప్పారు. యూఏఈ నాయకత్వం, మాస్‌ వెడ్డింగ్స్‌ని ప్రోత్సహిస్తోందనీ, ఈ సహకారం ఇకపైనా కొనసాగుతుందని డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఆఫీస్‌ ఆఫ్‌ ది మినిస్టర్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ ఎఫైర్స్‌ మరియు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఫ్యామిలీ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ అలి సలీమ్‌ కాబి చెప్పారు. ఈ సందర్భంగా గ్రూప్‌ వెడ్డింగ్‌ పార్టిసిపెంట్స్‌ ప్రెసిడెంట్‌కి కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com