జూలై నుంచి షెంగెన్ వీసా రద్దు విధానం రద్దు..!!

- May 24, 2025 , by Maagulf
జూలై నుంచి షెంగెన్ వీసా రద్దు విధానం రద్దు..!!

మస్కట్ : ఈ వేసవిలో మీరు యూరప్ సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. ఇది మీ కోసమే. జూలై 1నుండి జర్మనీ ఫెడరల్ విదేశాంగ కార్యాలయం ప్రపంచవ్యాప్తంగా వీసా తిరస్కరణలకు సంబంధించిన ఫిర్యాదు విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పు ప్రకారం.. తిరస్కరించబడిన వీసా దరఖాస్తుదారులు ఇకపై తమ దరఖాస్తును ప్రాసెస్ చేసిన జర్మన్ మిషన్‌కు నేరుగా అధికారిక ఫిర్యాదు (ఒక రకమైన అప్పీల్ లేదా అభ్యంతరం) సమర్పించలేరు. ఇప్పటివరకు, వీసా తిరస్కరణ లేఖ అందిన ఒక నెలలోపు అభ్యర్థులు వీసా దరఖాస్తు కొత్త పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగలిగేవారు. దరఖాస్తుదారులు ఇప్పుడు బెర్లిన్‌లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టులో దావా వేయడం ద్వారా చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది.
వీసా తిరస్కరణను సవాలు చేయాలనుకునే దరఖాస్తుదారులకు చట్టపరమైన మార్గాలను అనుసరించే ముందు ఈ ఫిర్యాదు ప్రక్రియ గతంలో తప్పనిసరి దశగా ఉండేది. వీసా దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, పరిపాలనా భారాలను తగ్గించడం దీని రద్దు లక్ష్యమని తెలిపారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జర్మన్ దౌత్య కార్యకలాపాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com