242,000 క్యాప్టగాన్ పిల్స్ సీజ్.. ఐదు ప్రయత్నాలు విఫలం: సౌదీ కస్టమ్స్

- May 24, 2025 , by Maagulf
242,000 క్యాప్టగాన్ పిల్స్ సీజ్.. ఐదు ప్రయత్నాలు విఫలం: సౌదీ కస్టమ్స్

రియాద్ : అల్-రుబ్ అల్-ఖలీ, అల్-హదీతా, అల్-దుర్రా సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా సౌదీ అరేబియాలోకి మొత్తం 242,296 యాంఫెటమైన్ పిల్స్ అక్రమంగా రవాణా చేయడానికి ఐదు వేర్వేరు ప్రయత్నాలను విఫలం చేసినట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) ప్రకటించింది. అథారిటీ ప్రతినిధి హమ్మౌద్ అల్-హర్బి ప్రకారం.. అల్-రుబ్ అల్-ఖలీ ఓడరేవులో ట్రక్కు భాగాలలో దాచిన 202,570 పిల్స్ సీజ్ చేశారు. అల్-హదీతా ఓడరేవులో మూడు వేర్వేరు ప్రయత్నాలను అడ్డుకున్నారు. మొదటిదానిలో ట్రక్కు లోపల ప్రత్యేకంగా రూపొందించిన కంపార్ట్‌మెంట్లలో దాచిన 9,859 పిల్స్, రెండవదానిలో విద్యుత్ వైర్ల రవాణాలో దాచిన 6,040 పిల్స్, మూడవ ప్రయత్నంలో ఒక వాహనం డ్రైవ్ షాఫ్ట్ లోపల దాచిన 11,424 పిల్స్ ను సీజ్ చేశారు.
ఐదవ ప్రయత్నం అల్-దుర్రా పోర్టులో నమోదైంది. వాహనం డ్రైవ్ షాఫ్ట్‌లో దాచిపెట్టిన 12,403 యాంఫెటమైన్ పిల్స్ ను గుర్తించి సీజ్ చేశారు. 
ఈ కేసులకు సంబంధించి వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. 
ఉల్లంఘనలను గోప్యంగా నివేదించడం ద్వారా స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. విజిల్‌బ్లోయర్లకు ఆర్థిక బహుమతి అందజేస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com