ఐదు నెలల్లో 12వేల మంది కార్మికులు అరెస్ట్..!!
- May 25, 2025
మస్కట్: సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సర్వీసెస్ కార్పొరేషన్ (SSC) కార్మిక మార్కెట్ నిబంధనలను అమలు చేయడంలో తన కార్యాకలాపాలను ముమ్మరం చేసిందని, ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఒమన్ అంతటా 12,319 మంది కార్మిక చట్ట ఉల్లంఘనదారులను అరెస్టు చేసి 7,615 మందిని బహిష్కరించారని సీఈఓ రిటైర్డ్ బ్రిగేడియర్ సయీద్ బిన్ సులైమాన్ అల్ అస్మి తెలిపారు.
2024లో SSC 23,566 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసిందని, దాని అమలు డ్రైవ్లో భాగంగా 18,053 మందిని బహిష్కరించింది. సుల్తానేట్లోని అన్ని గవర్నరేట్ల నుండి 12,210 కంటే ఎక్కువ మంది పౌరులతో కార్పొరేషన్ 100 శాతం ఒమానైజేషన్ను సాధించిందని అల్ అస్మి ధృవీకరించారు.
ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు 665 మంది ఒమానీ పౌరులను SSC నియమించింది. భవిష్యత్తులో కార్పొరేషన్ మే 202 6 నాటికి దాదాపు 2,000 మంది ఒమానీలను చేర్చుకోవాలని యోచిస్తోందన్నారు. వ్యవసాయం, మత్స్య, జల వనరుల మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యంతో కార్పొరేషన్ అక్రమ చేపల వేట కార్యకలాపాలను నిరోధించడానికి తీరప్రాంత మండలాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!