51.6°Cకి ఉష్ణోగ్రతలు..గ్యాస్ ప్రమాదాలను ఎలా నివారించాలి..!!

- May 25, 2025 , by Maagulf
51.6°Cకి ఉష్ణోగ్రతలు..గ్యాస్ ప్రమాదాలను ఎలా నివారించాలి..!!

యూఏఈ: యూఏఈలో వేసవి ఉష్ణోగ్రతలు 51°C కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈసమయంలో వంట గ్యాస్‌ ప్రమాదాలను నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భద్రతా నిపుణులు నివాసితులు, రెస్టారెంట్ నిర్వాహకులను కోరుతున్నారు. అల్ బర్షాలోని రెస్టారెంట్లలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యలో అజ్మాన్‌లోని అలమాన్ గ్యాస్ LPG బాట్లింగ్ ప్లాంట్ జనరల్ మేనేజర్ మొహమ్మద్ ఔన్ పలు సూచనలు చేశారు.  అధిక ఉష్ణోగ్రతలు సిలిండర్ లోపల గ్యాస్ విస్తరించడానికి కారణమవుతాయని.. దాంతో ఒత్తిడి,  లీకేజీల ప్రమాదాన్ని పెంచుతాయని వివరించారు. ఎల్లప్పుడూ సిలిండర్లను నీడ ఉన్న, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో, ప్రత్యక్ష సన్ లైట్ లేదా వేడికి దూరంగా ఉంచలని సూచించారు.   “లీక్‌లను తనిఖీ చేయడానికి సబ్బు ద్రావణాన్ని ఉపయోగించండి. గ్యాస్ ఉపకరణాలను ఉపయోగించనప్పుడు ఎల్లప్పుడూ ప్రధాన వాల్వ్‌ను ఆపివేయండి.” అని సూచించారు.

హెచ్చరిక సంకేతాలు: గ్యాస్ వాసన, గ్యాస్ పైపులు లేదా ఉపకరణాల దగ్గర హిస్సింగ్ శబ్దం,  తల తిరుగుతున్నట్లు, వికారం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, బలహీనమైన లేదా మినుకుమినుకుమనే మంటలు,  అసాధారణ బర్నర్ శబ్దాలు.

అరేబియన్ యూనిగాజ్ కంట్రీ మేనేజర్ ఫైసల్ ఎల్ మైస్ మాట్లాడుతూ.. వంటశాలలలో, ముఖ్యంగా చిన్న లేదా రద్దీగా ఉండే వాటిలో పేలవమైన వెంటిలేషన్ అతిపెద్ద ప్రమాదాలలో ఒకటి అని తెలిపారు.  పరిమిత ప్రదేశాలలో విష వాయువులు త్వరగా పేరుకుపోతాయన్నారు. గాలిలో ఎక్కువ ఆక్సిజన్ లేదా LPG ఉంటే, అది ఆకస్మిక మంటలు లేదా పేలుళ్లకు దారితీస్తుందని హెచ్చరించారు. అదనపు రక్షణకు గ్యాస్ లీక్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.     

వేడి వల్ల గ్యాస్ విస్తరించడానికి కారణమవుతుందని, ఇది సిలిండర్ గోడలు, వాల్వ్‌లపై ఒత్తిడిని కలిగిస్తుందదని బెల్ అలీలోని ఒక ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కంపెనీలో భద్రతా ఇంజనీర్ సలీం ఇక్రమ్ తెలిపారు.  గ్యాస్ స్టవ్‌లు లేదా గ్రిల్‌లను గమనించాలి, వంట పూర్తి చేసిన తర్వాత ఎల్లప్పుడూ రెగ్యులేటర్‌ను ఆపివేయాలన్నారు.

వేసవిలో కొన్ని భద్రతా చిట్కాలు:

చల్లని, నీడ ఉన్న ప్రదేశాలలో సిలిండర్లను పెట్టాలి.

నిటారుగా దృఢమైన ఉపరితలాలపై పెట్టాలి.

ఎప్పుడూ సిలిండర్‌ను పడవేయవద్దు, దొర్లించవద్దు

లీకేజీలు, అరిగిపోవడం, తుప్పు పట్టడం ఉంటే ఫిర్యాదులు చేయాలి.

ఇంట్లో గ్యాస్ లీక్ డిటెక్టర్లను ఇన్‌స్టాల్ చేయాలి.

ఇంట్లో అగ్నిమాపక యంత్రాన్ని పెట్టుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com