కువైట్లో జూన్ 7 నుండి వేసవి సీజన్ ప్రారంభం..!!
- May 25, 2025
కువైట్: వేసవి ప్రారంభానికి సూచనగా భావించే 'తురాయ' సీజన్ జూన్ 7న కువైట్లో ప్రారంభమవుతుందని అల్-ఓజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. 'అల్-బతీన్' సీజన్ ఆదివారం ప్రారంభమై 13 రోజుల పాటు కొనసాగుతుందని, ఇది "అల్-కన్నా" సీజన్ చివరి దశను సూచిస్తుందన్నారు. "అల్-బతీన్" సమయంలో పగటిపూట 13 గంటల 47 నిమిషాలకు పైగా ఉంటుందని, సూర్యాస్తమయం సాయంత్రం 6:38 గంటల వరకు ఆలస్యం అవుతుందని, రాత్రి సమయం తక్కువగా నమోదు అవుతుందన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 50°Cకి దగ్గరగా ఉన్నప్పటికీ, వేసవి అసలు ప్రారంభం అని భావించే “తురాయ” సీజన్ జూన్ 7న ప్రారంభమవుతుందని కేంద్రం పేర్కొంది. “తురాయ” సీజన్లో గల్ఫ్ దేశాలతో సహా అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుకుంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆధార్ కొత్త నియమాలు తెలుసా
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!







