షార్జాలో మామిడి ఫెస్టివల్.. కిలోకు Dh10నుండి ప్రారంభం..!!

- May 26, 2025 , by Maagulf
షార్జాలో మామిడి ఫెస్టివల్.. కిలోకు Dh10నుండి ప్రారంభం..!!

యూఏఈ: షార్జాలో మామిడి ఫెస్టివల్ జూన్ 27 నుండి ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు ఎక్స్‌పో ఖోర్ ఫక్కన్‌లో జరుగుతుంది.  ఇందులో ప్రీమియం స్థానిక మామిడి రకాలను ప్రదర్శించనున్నారు. యూఏఈ నుండి నివాసితులు సీజన్‌లో తియ్యటి మామిడి పండ్లను కనుగొలు చేయడానికి స్థానిక మార్కెట్లకు తరలివస్తారు. వివిధ వర్గాలకు అందుబాటులో ఉండేలా ధరలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. 

యెమెన్ మామిడి (అత్యంత సరసమైనది): కిలోకు Dh10

అల్ఫోన్సో మామిడి: పెట్టెకు Dh45 (12 పెద్ద మామిడిపండ్లు), పెట్టెకు Dh35-40 (15 మధ్య తరహా మామిడిపండ్లు)

పెరువియన్ మామిడి (అతిపెద్ద వాటిలో): కిలోకు Dh35 లేదా పెట్టెకు Dh90-110 (4-5 కిలోలు)

కొలంబియన్ మినీ మామిడి (దుబాయ్‌లోని వాటర్‌ఫ్రంట్ మార్కెట్‌లో మాత్రమే లభిస్తుంది): పెట్టెకు Dh90-100

కంబోడియన్, చైనీస్ మామిడిపండ్లు: కిలోకు Dh18

ఈ ఉత్సవంలో రైతుల కోసం వర్క్‌షాప్‌లు ఉంటాయని నిర్వాహక అధ్యక్షుడు ఖలీల్ అల్ మన్సూరి తెలిపారు.  "ఈ ఉత్సవం యూఏఈలో పండించిన ఉత్పత్తుల నాణ్యతను హైలైట్ చేయడంతోపాటు స్థానిక మార్కెట్లలో వాటి ఉనికిని పటిష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది" అని అల్ మన్సూరి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com