దుబాయ్ వెళ్లే ఫ్లైట్ 2 గంటలు ఆలస్యం..నరకం చూసిన ప్యాసింజర్స్..!!
- May 26, 2025
న్యూఢిల్లీ: భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం 2205 సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. దీని ఫలితంగా ఢిల్లీ విమానాశ్రయంలో రెండు గంటలు ఆలస్యం అయింది. ఫలితంగా, విమానంలో ఉన్న ప్రయాణికులు 90 నిమిషాలకు పైగా విద్యుత్ సరఫరా లేకుండా కూర్చోవాల్సి వచ్చింది. ప్రయాణికుల ఫిర్యాదులతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు, సమస్యను పరిష్కరించడానికి సాంకేతిక బృందాన్ని పిలిపించారు. అయినప్పటికీ, రెండు గంటల పాటు విమానంలో కూర్చున్న ప్రయాణీకులు ఉక్కబోతతో నరకం చూశారు. ఫ్లైట్ సిబ్బంది ప్రవర్తన కూడా సరిగ్గా లేదని పలువురు తమ సోషల్ మీడియాలో పోస్టుల్లో ఫైరయ్యారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







