బహ్రెయిన్ డిప్యూటీ ప్రధాన మంత్రితో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం భేటీ..!!
- May 26, 2025
మనామా: బహ్రెయిన్ రాజ్యం ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, పార్లమెంటు సభ్యుడు బైజయంత్ పాండా నేతృత్వంలో భారత పార్లమెంట్ నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఘనేమ్ బిన్ ఫద్ల్ అల్ బుయైనైన్ సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా బహ్రెయిన్ - భారతదేశం మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను హైలైట్ చేశారు. బహ్రెయిన్ అభివృద్ధి ప్రయాణంలో భారతీయ సమాజం పోషించిన ముఖ్యమైన పాత్రను ఉప ప్రధాన మంత్రి ప్రశంసించారు. స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడం ప్రాథమికం అని తెలిపారు.
ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంలో బహ్రెయిన్ ప్రయత్నాలకు ఎంపీ బైజయంత్ పాండా ప్రశంసించారు. బహ్రెయిన్ నిరంతర అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం బహ్రెయిన్, భారతదేశం మధ్య బలమైన భాగస్వామ్యాన్ని, భవిష్యత్ సహకారం కోసం ఉమ్మడి దృక్పథాన్ని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం