కువైట్ లో అడుగుపెట్టిన భారతదేశ అఖిలపక్ష ప్రతినిధి బృందం..!!

- May 26, 2025 , by Maagulf
కువైట్ లో అడుగుపెట్టిన భారతదేశ అఖిలపక్ష ప్రతినిధి బృందం..!!

కువైట్: భారత పార్లమెంటు సభ్యుడు బైజయంత్ జే పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం సోమవారం ఉదయం కువైట్ చేరుకున్నది. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద దురాగతాలు, ఆపరేషన్ అనంతరం పరిణామాల గురించి కువైట్ ప్రభుత్వానికి వివరించనుంది. భారత ప్రతినిధి బృందాన్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా స్వాగతం పలికారు. అంతకుముందు భారత ప్రతినిధుల బృందం బహ్రెయిన్ లో తన పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకుంది.

భారత ప్రతినిధి బృందంలో కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే ఎంపీ (లోక్‌సభ), నాగాలాండ్ నుండి రాజ్యసభకు ఎన్నికైన మొదటి మహిళ ఎస్ ఫాంగ్నాన్ కోన్యాక్ ఎంపీ (రాజ్యసభ); జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ రేఖ శర్మ ఎంపీ (రాజ్యసభ); ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎంపీ(లోక్‌సభ); చండీగఢ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఛాన్సలర్ సత్నాం సింగ్ సంధు ఎంపీ (రాజ్యసభ) ఉన్నారు. కువైట్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రతినిధి బృందం కువైట్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో పాటు సివిల్ సొసైటీలోని ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతోంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com