యూఏఈలో 4 రోజులపాటు ఈద్ సెలవులు..Dh1,999 నుండి ట్రావెల్ డీల్స్ ప్రారంభం..!!

- May 26, 2025 , by Maagulf
యూఏఈలో 4 రోజులపాటు ఈద్ సెలవులు..Dh1,999 నుండి ట్రావెల్ డీల్స్ ప్రారంభం..!!

యూఏఈ: మే 27న నెలవంకతో సంబంధం లేకుండా నివాసితులకు వచ్చే నెల ఈద్ అల్ అధా కోసం నాలుగు రోజుల సెలవులు లభిస్తాయి. మే 28న దుల్ హిజా ప్రారంభమవుతుందని ఖగోళ నిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా టూర్ వెళ్లేందుకు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయని స్మార్ట్ ట్రావెల్‌కు చెందిన సఫీర్ మొహమ్మద్ అన్నారు. ఇతర గల్ఫ్ దేశాలు సెలవులు ప్రకటించడంతో టూర్ బుకింగ్స్ ఎంక్వైరీలు పెరిగాయని అన్నారు. అదే సమయంలో చాలా మంది CIS దేశాల వంటి వీసా రహిత ప్రదేశాల వైపు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.  కింగ్‌డమ్‌లో ఇంకా అధికారిక తేదీలు ప్రకటించనప్పటికీ, సౌదీ ఎక్స్ఛేంజ్ (తడావుల్) 6 రోజులపాటు సెలవులు ప్రకటించింది.

ఈద్ ప్యాకేజీలకు ఖచ్చితంగా అధిక డిమాండ్ ఉంటుందని అక్బర్ ట్రావెల్స్‌కు చెందిన మొహమ్మద్ కాసిమ్ తెలిపారు. దాదాపుగా అన్ని టూర్ ఫ్యాకేజీలు సేల్ అయ్యాయని తెలిపారు. వేసవిలో ఈద్ రావడంతో, యూరప్ అగ్ర ఎంపికగా కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా స్కెంజెన్ వీసాల కోసం ముందుగానే దరఖాస్తు చేసుకున్న ప్రయాణికులలో, పరిమిత అపాయింట్‌మెంట్ గురించి అవగాహన ఉందన్నారు. చాలామంది ఈద్ కోసం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు ఉండే తక్కువ ప్రయాణాలను ఇష్టపడతారని, ధరలు Dh1,999 నుండి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.   

ఈ సంవత్సరం  మే 27, 29 దుల్ ఖదాకు అనుగుణంగా సెలవులు ఉంటాయి.  మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించినట్లయితే, మే 28 జుల్ హిజ్జా 1 అవుతుంది. అంటే, ఈద్ జూన్ 6 శుక్రవారం వస్తుంది. మంగళవారం నెలవంక కనిపించకపోతే, మే 29న జుల్ హిజ్జా 1 అవుతుంది. అంటే ఈద్ జూన్ 7 శనివారం వస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com