కువైట్ కు చెందిన థింక్ ట్యాంకర్లతో 'న్యూ నార్మల్' విధానాన్ని పంచుకున్న ఇండియా..!!
- May 27, 2025
కువైట్: భారత పార్లమెంటు సభ్యుడు బైజయంత్ పాండా నేతృత్వంలోని ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం కువైట్ పర్యటన సందర్భంగా కువైట్‌కు చెందిన థింక్ ట్యాంకర్లతో సమావేశమైంది. సరిహద్దు ఉగ్రవాద సంఘటనలను ఎదుర్కోవడంలో భారతదేశం అనుసరించిన 'న్యూ నార్మల్' విధానాన్ని వారితో షేర్ చేసుకుంది. ప్రైవేట్, నిష్పక్షపాత, ప్రభుత్వేతర పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అయిన రికనైసెన్స్ రీసెర్చ్ సహ-హోస్ట్ చేసిన ఈ దివానియాకు రాజకుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు, సీనియర్ ఎడిటర్లు, థింక్-ట్యాంక్ నిపుణులు, కువైట్ పౌర సమాజం నుండి ప్రముఖులు హాజరయ్యారు.
భారత ప్రతినిధి బృందం..బలమైన భారతదేశం-కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్త.. భారత ఉపఖండంలో ఇటీవలి సరిహద్దు ఉగ్రవాద పరిస్థితిని తెలియజేసింది. ఉగ్రవాదం మానవాళికి వ్యతిరేకమని, దానిని అన్ని విధాలుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పాల్గొన్న వారందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.
అంతకుముందు, ప్రతినిధి బృందం కువైట్ ఉప ప్రధాన మంత్రి, క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి షెరిదా అబ్దుల్లా సాద్ అల్-మౌషెర్జీతో సమావేశం నిర్వహించింది. భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్‌లో శాంతి, అభివృద్ధిని దెబ్బతీసే ఉద్దేశ్యంతో పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడితో సహా, భారతదేశానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాద చర్యలను ప్రతినిధి బృందం హైలైట్ చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతిస్పందనను తెలియజేశారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్' విధానాన్ని, ఉగ్రవాదులకు.. వారికి మద్దతు ఇచ్చేవారికి మధ్య ఎటువంటి తేడాను చూపని 'న్యూ నార్మల్' విధానాన్ని ప్రతినిధి బృందం వివరించింది.
తాజా వార్తలు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు







