ఇంట్లో గంజాయి సాగు.. డైవర్‌కు జైలు శిక్ష..!!
- May 28, 2025
మనామా: అడ్లియాలోని రెండంతస్తుల ఇంటిలో గంజాయి సాగు చేసిన కేసులో నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. దాంతో మాదకద్రవ్యాల ముఠాకు అధిపతిగా పనిచేసిన ప్రొఫెషనల్ డైవర్‌తో పాటు ఇద్దరు సహచరులకు జీవిత ఖైదు విధించారు. హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి BD5,000 జరిమానా విధించింది. నాల్గవ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, BD5,000 జరిమానా విధించగా, ఐదవ వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష, BD1,000 జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత 51 ఏళ్ల రింగ్లీడర్ను బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులను జప్తు చేయాలని తీర్పునిచ్చింది.
డైవర్ ఆరు సంవత్సరాలుగా తన వృత్తిని కవర్‌గా ఉపయోగిస్తున్నాడని, తన నివాసం నుండి గంజాయి సాగు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ ఫ్లాట్ నుంచి మొక్కలు, హీట్ ల్యాంప్‌లు, ఎరువులు, ఫ్యాన్లు, రాక్లను సిజ్ చేశామన్నారు. ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. అతనికి ఉన్న పరిచయాలతో కొనుగోలుదారులకు అమ్మకాలు చేసవాడని తెలిపారు. ఆర్డర్లను డెలివరీ చేయడానికి హ్యాండ్ఆఫ్లు, డ్రాప్ పాయింట్లను ఉపయోగించేవారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







