ఖతార్ లో ప్రైవేట్ హెల్త్ సెంటర్ మూసివేత..!!
- May 28, 2025
దోహా, ఖతార్: ప్రైవేట్ హెల్త్‌కేర్ రంగంలో పనిచేస్తున్న ఒక ఆరోగ్య కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంత్రిత్వ శాఖ తనిఖీల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో నిబంధనలకు సరపడా వైద్య నిపుణులు లేరని నిర్ధారణ కావడంతో మూసివేయాలని నిపుణులు సూచించారు. మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను ఉల్లంఘించిందని వెల్లడించింది.
దేశంలోని అన్ని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు.. ఆరోగ్య సంరక్షణ నియంత్రణ చట్టాలు, నిబంధనలను పాటించాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రోగుల భద్రత, అందించే ఆరోగ్య సేవల నాణ్యతను నిర్ధారించడానికి ఏదైనా ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు అన్ని చట్టబద్ధమైన నిబంధనలను పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







