మీడియా కంటెంట్ నియంత్రణ..యూఏఈలో ఏజ్ రేటింట్ సిస్టం అమలు..!!
- May 30, 2025
యూఏఈ: యూఏఈలో ఏజ్ రేటింట్ సిస్టం అమలు చేయనున్నారు. దీని ప్రకారం.. పిల్లలు, టీనెజర్స్ ను అనవసరమైన కంటెంట్ నుంచి రక్షించనుంది. డిజిటల్ కంటెంట్ వినియోగం పెరుగుతున్నందున "సమగ్ర" వ్యవస్థ చాలా కీలకం అని యూఏఈ మీడియా కౌన్సిల్ తెలిపింది. అయితే, ఈ వ్యవస్థను ఎప్పుడు లేదా ఎలా అమలు చేస్తారో కౌన్సిల్ పేర్కొనలేదు.
ప్రస్తుతం యూఏఈలో సినిమాలు, వీడియో, ఎలక్ట్రానిక్ గేమ్‌లు, కామిక్స్, ప్రింటెడ్ పుస్తకాలు అలాగే ఇతర మెటీరియల్‌ల కోసం ఏజ్ రేటింట్ సిస్టంను కలిగి ఉంది. అనుచితమైన కంటెంట్ నుండి పిల్లలను రక్షించడమే లక్ష్యమని ఈ సందర్భంగా మీడియా కౌన్సిల్, స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీస్ సెక్టార్ సీఈఓ మైతా అల్ సువైది తెలిపారు. 40 సంవత్సరాలలో జారీ చేయబడిన మొదటి మీడియా చట్టంగా, ఇది భవిష్యత్తు-ప్రూఫ్ మీడియా ల్యాండ్‌స్కేప్‌కు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని, డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, ఆన్-డిమాండ్ బ్రాడ్‌కాస్టింగ్, ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలో పురోగతిని పరిష్కరిస్తుందని యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ అల్ షెహి వెల్లడించారు. ఇలాంటి చర్యలు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం, ప్రేక్షకులను రక్షించడం, ఆన్లైన్ మీడియా కంటెంట్ నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంటుందన్నారు. పర్మిట్ ఫీజుల నుండి మూడు సంవత్సరాల మినహాయింపు ద్వారా కంటెంట్ సృష్టికర్తలకు ఇది ఖచ్చితమైన మద్దతును కూడా అందజేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







