అందుబాటులోకి ఈదియా ATMలు: QCB

- May 31, 2025 , by Maagulf
అందుబాటులోకి ఈదియా ATMలు: QCB

దోహా: వివిధ ప్రాంతాల్లో ఈదియా ATM సేవలు అందుబాటులోకి వచ్చినట్టు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రకటించింది .ఈ ATMలు 10 ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయని.. 5, 10, 50-100 డినామినేషన్లలో విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఈదియా ATMలు వెండోమ్ మాల్, మాల్ ఆఫ్ ఖతార్, అల్-వక్రా ఓల్డ్ సౌక్, దోహా ఫెస్టివల్ సిటీ (DFC), అల్-హజ్మ్ మాల్, అల్-మిర్కాబ్ మాల్, అల్-ఖోర్ మాల్, అల్-మీరా (ముయిథర్), అల్-మీరా (అల్-తుమామా) ఉన్నాయని వెల్లడించింది. చిన్న పిల్లలకు డబ్బును బహుమతిగా ఇచ్చే ఈదీ ఆచారంతోపాటు ఖతారీ వారసత్వం, సంస్కృతిని పరిరక్షించే  ప్రయత్నంలో భాగంగా ఈదియా ATM సేవలను తీసుకొచ్చినట్లు తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com