సోషల్ మీడియా పుకార్లు, నకిలీ పోస్ట్‌లు..7 మంది పై చర్యలు..!!

- May 31, 2025 , by Maagulf
సోషల్ మీడియా పుకార్లు, నకిలీ పోస్ట్‌లు..7 మంది పై చర్యలు..!!

యూఏఈ: సోషల్ మీడియా పుకార్లు, నకిలీ పోస్ట్‌లకు సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు రసల్ ఖైమాలోని అధికారులు తెలిపారు. కంటెంట్‌ను ప్రచురించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు రసల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండ్ తెలిపింది.  పుకార్లు నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం యూఏఈలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.  దీనికి Dh100,000 నుండి Dh200,000 వరకు జరిమానాలతోపాటు ఒకటి నుండి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.

ఏప్రిల్ 12న అబుదాబి పోలీసులు పుకార్లు, నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని ప్రజలను కోరుతూ ఒక అడ్వైజర్ ను జారీ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వార్తలను ప్రసారం చేసే ముందు సమాచారాన్ని ధృవీకరించుకోవాలని,  ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించాలని అధికార యంత్రాంగం నివాసితులను కోరింది.  

అలాగే, సహజీవన విధానానికి విరుద్ధంగా ఉన్న సామాజిక వ్యతిరేక , నైతికంగా అనైతిక కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షేర్ చేసే నివాసితులు Dh1 మిలియన్ వరకు జరిమానాతోపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు తెలిపారు. యూఏఈ చట్టం ప్రకారం, నిషేధించబడిన కంటెంట్‌ను రీ పోస్ట్ చేసే వ్యక్తులు కూడా అసలు నిందితుడితో సమానంగా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి Dh1,000 నుండి Dh1 మిలియన్ వరకు పరిపాలనా జరిమానాలు విధించవచ్చు.  పదేపదే ఉల్లంఘనలకు సంబంధించి Dh2 మిలియన్ల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయా మీడియా సంస్థలను 6 నెలల వరకు మూసివేస్తారు.  లైసెన్స్ లేని మీడియా సంస్థలకు శాశ్వతంగా మూసివేస్తారని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com