సోనూసూద్ కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్
- June 01, 2025
హైదరాబాద్: అందాల భామ ఎవరో తేలిపోనుంది.ప్రపంచ సుందరిని ఎంపిక చేసే మిస్ వరల్డ్ కాంటెస్ట్ హైదరాబాద్ హైటెక్స్ లో కనుల విందుగా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల నుంచి అందాల భామలు పోటీపడ్డారు.ఇండియా నుంచి నందిని గుప్తా పోటీ పడ్డారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు జడ్జీలుగా జూలియా మోర్లీ, సోనూ సూద్, రానా దగ్గుబాటి, మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, జయేశ్ రంజన్, మానుషి చిల్లర్, సుధారెడ్డి ఉన్నారు.సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముద్దుగుమ్మలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.
ప్రముఖ నటుడు, గొప్ప మానవతావాది సోనూసూద్ కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్ దక్కింది. నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా సోనూ సూద్ ఆ పురస్కారం అందుకున్నారు.
మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ కు అతిరథ మహారధులు తరలివచ్చారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఈవెంట్ లో తళుక్కుమన్నారు. ఫైనల్స్ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి దంపతులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు దంపతులు సందడి చేశారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







