డైరెక్టర్ శేఖర్‌ కమ్ములని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

- June 01, 2025 , by Maagulf
డైరెక్టర్ శేఖర్‌ కమ్ములని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు శేఖర్‌ కమ్ముల. ఈ సందర్భంగా '25 ఇయర్స్ అఫ్  శేఖర్‌ కమ్ముల' సెలబ్రేటింగ్ ది సోల్ అఫ్ స్టొరీ టెల్లింగ్ పోస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసి ఆయన్ని అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శేఖర్‌ కమ్ముల  సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.

''టీనేజీలో ఒక్కసారి చిరంజీవి గారిని దగ్గరగా చూశాను. 'ఈయనతో సినిమా తీయాలి' అనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్ . 'lets celebrate' అని మా team అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని generationsని inspire చేసిన personality ఆయన. 'chase your dreams, success మనల్ని follow అయి తీరుతుంది' అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే.  so, నా 25 years journey celebration అంటే ఆయన presenceలోనే చేసుకోవాలి అనిపించింది. Thank You Sir. ఈ momentsలోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు' అని శేఖర్‌ కమ్ముల రాసుకొచ్చారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

‘ఆనంద్‌, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్‌’, ‘లీడర్‌’, ‘ఫిదా’ ‘లవ్‌ స్టోరీ’ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు శేఖర్‌ కమ్ముల. ప్రస్తుతం ధనుష్‌, నాగార్జున హీరోలుగా పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ తో అలరించడానికి రెడీ అయ్యారు. జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com