టాలీవుడ్ యంగ్ హీరో - నిఖిల్
- June 01, 2025
చూడగానే మనకు బాగా పరిచయం ఉన్న అబ్బాయిలా కనిపిస్తాడు. మన పక్కింటి కుర్రాడే అనిపిస్తాడు నిఖిల్ సిద్ధార్థ్! తనదైన చలాకీ అభినయంతో సాగుతున్న నిఖిల్ నవతరం ప్రతినిధిగా కనిపించే పాత్రల్లో సాగుతున్నాడు. కాన్సెప్ట్ బెస్ట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ... కంటెంట్ ఓరియంటెడ్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేసే యంగ్ హీరో నిఖిల్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
నిఖిల్ సిద్ధార్థ్ 1985 జూన్ 1న హైదరాబాద్ లో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత ‘ముఫ్పఖమ్ ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’లో బి.టెక్, చదివాడు. అతని మనసు చదువుకొనే రోజుల నుంచీ సినిమాలపైనే లగ్నమయింది. అయితే, ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా బుద్ధిగా చదువుకున్నాడు కానీ, సినిమాలవైపే పరుగు తీశాడు. ‘హైదరాబాద్ నవాబ్స్’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. తరువాత కొన్ని చిత్రాల్లో బిట్ రోల్స్ లోనూ కనిపించాడు. శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’లో రాజేశ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు నిఖిల్.
అతను హీరోగా రూపొందిన ‘యువత’ భలేగా అలరించింది. ఈ చిత్రం ద్వారానే ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ తొలిసారి మెగాఫోన్ పట్టాడు. ‘యువత’తో మంచి పేరు సంపాదించిన నిఖిల్ ఆ పై”ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, స్వామి రా రా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం” వంటి చిత్రాలతో మురిపించాడు. 2022లో వచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ-2’ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్‌గా నిలిచి నిఖిల్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది.
కార్తికేయ-2 తర్వాత అలాంటి స్థాయిలోనే సినిమాలు చేసినప్పటికి అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రస్తుతం నిఖిల్ రెండు సినిమాలు చేస్తున్నారు. రెండు హిస్టారికల్ బేస్డ్ ఫిలిమ్స్ ఆయన చేతిలో ఉన్నాయి. నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'స్వయంభూ'. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







