బహ్రెయిన్ లో జీరో టోలరెన్స్.. డ్రైవింగ్ నిర్లక్ష్యంపై ఇక కఠిన చర్యలు..!!
- June 01, 2025
మనామా: రహదారులపై వాహనదారుల భద్రతకు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గాయలు, లేదా మరణానికి దారితీసే ట్రాఫిక్ ఉల్లంఘనలకు చట్టపరమైన శిక్షలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నిర్లక్ష్య ప్రవర్తనను నియంత్రించే లక్ష్యంతో కొత్త చట్టాన్ని రూపొందించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ప్రజా భద్రత, సామాజిక శ్రేయస్సుకు నిరంతర ముప్పుగా భావించే వాటిని ఎదుర్కోవడానికి కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు.
రోడ్డు భద్రతకు ప్రాధాన్యత
రహదారుల భద్రత కేవలం నియంత్రణ సమస్య మాత్రమే కాదని, జాతీయ భద్రతకు మూలస్తంభమని చెప్పారు. అన్ని రహదారులు వాహనదారులకు సురక్షితమైన, స్థిరమైన ట్రాఫిక్ వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు. అదే సమయంలో సామాజిక భద్రత, శ్రేయస్సుకు మూలస్తంభంగా రహదారుల భద్రత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రతిపాదిత చట్టాలు వేగంగా నడపడం, నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేయడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి అధిక-ప్రమాదకర ప్రవర్తనలకు కఠిన శిక్షలు వేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







