నార్వే చెస్ టోర్నీలో చరిత్ర: గుకేశ్ చేతిలో కార్ల్‌సన్ ఓటమి
- June 02, 2025
నార్వే: నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అసాధారణ విజయాన్ని అందుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. క్లాసికల్ చెస్‌లో కార్ల్‌సన్‌ను ఓడించడం గుకేశ్‌కు ఇదే మొదటిసారి కావడం గమనార్హం.ఈ విజయం తర్వాత గుకేశ్ కాసేపు ఆవేశంతో నిలిచిపోయాడు. అంత గొప్ప ఆటగాడిని ఓడించామంటే అది చిన్న విషయం కాదు. ఈ ఓటమితో అసహనానికి లోనైన కార్ల్‌సన్ తట్టుకోలేకపోయాడు. పిడికిలితో చెస్ బోర్డు టేబుల్‌ను గట్టిగా కొట్టాడు. గుకేశ్‌ను చూసి రెండుసార్లు “సారీ” చెప్పిన కార్ల్‌సన్ వెంటనే హాలునుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆరవ రౌండ్ ప్రారంభం నుంచే గుకేశ్ శాంతంగా, స్ట్రాటజిక్‌గా ఆడాడు. కార్ల్‌సన్ చేసిన ఒక చిన్న తప్పును చక్కగా వినియోగించుకొని, ఆపై పూర్తిగా గేమ్‌పై పట్టేసుకున్నాడు. ఒక్కసారిగా ఆధిపత్యం చూపించి ప్రత్యర్థిని చెక్‌మేట్‌కు దరికి తీసుకెళ్లాడు.గేమ్ ముగిసే సరికి ప్రపంచ నంబర్ 3 గుకేశ్, నంబర్ 1 కార్ల్‌సన్‌ను ఓడించాడు.
ఈ ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కార్ల్‌సన్ స్పందన, గుకేశ్ ఎమోషన్‌లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదే భారత యువత శక్తి,చెస్ లో ఇండియా రెడీ, అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇతర ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయంటే…
ప్రస్తుతం కార్ల్‌సన్ 6 రౌండ్లలో రెండు విజయాలు, మూడు డ్రాలు, ఒక ఓటమితో 9.1 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. ఫాబియానో కరువానా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గుకేశ్ మాత్రం మూడో స్థానానికి దూసుకొచ్చాడు. ఈ టోర్నీలో మిగిలిన రౌండ్లు మరింత ఉత్కంఠ రేపనున్నాయి.
కార్ల్‌సన్‌కు భారతులెప్పుడూ కష్టమేనా?
గతేడాది ఇదే టోర్నీలో మరో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద కూడా కార్ల్‌సన్‌ను ఓడించాడు. అంటే సొంత గడ్డపై భారత యువత నుండి రెండు ఎదురుదెబ్బలు తిన్నాడు కార్ల్‌సన్. ఇది చెస్ ప్రపంచంలో భారత్ పెరుగుతున్న ప్రాభవానికి నిదర్శనం.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







