జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

- June 02, 2025 , by Maagulf
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

న్యూ ఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(BS), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.

మే 18న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పుర్‌ సోమవారం విడుదల చేసింది. విద్యార్థులు పైన ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి రోల్‌ నంబర్‌, పుట్టినతేదీ, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి స్కోర్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ‘అడ్వాన్స్‌డ్‌’లో అభ్యర్థి సాధించిన మార్కులతో కామన్‌ ర్యాంక్‌ లిస్ట్‌ (CRL), కేటగిరీ ర్యాంక్‌ లిస్ట్‌ను ఇవ్వనున్నారు.

ఈ లింక్ క్లిక్ చేసీ ఫలితాలు తెలుసుకోవచ్చు.

https://jeeadv.ac.in

దేశ వ్యాప్తంగా దాదాపు 1.80 లక్షల మంది పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసినట్లు సమాచారం. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనా.గతేడాది అడ్వాన్స్‌డ్‌లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్‌ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు.గత విద్యాసంవత్సరం(2024-25) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉండగా.. మద్రాస్‌ ఐఐటీ సహా పలు ఐఐటీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడంతో ఈసారి సీట్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

జూన్‌ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (JOSAA)-2025 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌: 2030 నాటికి ఏ ఉద్యోగాలు పెరుగుతాయ్‌? ఏవి తగ్గుతాయ్‌?ఆరు విడతల్లో జోసా కౌన్సెలింగ్‌దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల జోసా కౌన్సెలింగ్‌ జరగనుంది. ఐఐటీ కాన్పుర్‌ ఇటీవల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (JOSAA)-2025 వెబ్‌సైట్లో ఉంచింది.

గతేడాది ఐదు రౌండ్లలో కౌన్సెలింగ్‌ జరగ్గా.. ఈసారి ఆరు విడతల్లో నిర్వహించనున్నారు.జూన్‌ 3వ తేదీన రిజిస్ట్రేషన్లు, ఛాయిస్ ఫైలింగ్‌ చేపట్టనుండగా..జూన్‌ 9, 11 తేదీల్లో మాక్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ 1, 2; జూన్‌ 12న ఫైనల్‌ ఛాయిస్‌ లాకింగ్‌ జరగనున్నాయి.అనంతరం ఒకటో విడత జోసా కౌన్సిలింగ్‌: జూన్‌ 14; రెండో విడత: జూన్‌ 21; మూడో విడత:జూన్‌ 28; నాలుగో విడత: జులై 4 ; ఐదో విడత: జులై 10; ఆరో విడత: జులై 16 తేదీల్లో నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com