'థగ్ లైఫ్' నుంచి 'విశ్వద నాయక' సాంగ్ రిలీజ్
- June 02, 2025
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమాలోని శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందించారు.
ఈ సినిమాలో ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు, ఫోర్త్ సింగిల్ - విశ్వద నాయక సాంగ్ ని విడుదల చేశారు. ఇది సినిమాలోని కమల్ హాసన్ పాత్రని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. రెహమాన్ పవర్ ఫుల్ ఆర్కెస్ట్రేషన్ తో అద్భుతమైన ట్రాక్‌ను అందించారు.
లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, కమల్ హాసన్ క్యారెక్టర్ నేచర్, అభిరామి, త్రిష పాత్రలలోని డైనమిక్స్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రశాంత్ వెంకట్ రాసిన ర్యాప్ పాటకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అలెగ్జాండ్రా జాయ్ వండర్ ఫుల్ వోకల్స్ ఎమోషన్ ని నావిగేట్ చేస్తూ... AR అమీన్ ర్యాప్ ఎనర్జీని మరింతగా పెంచింది. విజువల్ ఈ పాటలో కమల్ హాసన్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించడం అదిరిపోయింది.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ ఎన్ సుధాకర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో తూటాకు బలైన తెలంగాణ విద్యార్థి
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్‌లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..