కేదార్ నాథ్ యాత్రికులకు బిగ్ అలర్ట్..
- June 02, 2025
కేదార్ నాథ్ వెళ్లే యాత్రికులకు బిగ్ అలర్ట్. ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ వెళ్లే యాత్రికులు కేదార్ నాథ్ వెళ్లినప్పుడు అక్కడ నడవలేని వారు చాలా మంది గుర్రాలు, గాడిదల మీద వెళ్తుంటారు. స్థానిక వ్యాపారులకు ఇదో ఆదాయ వనరు. అయితే, డబ్బుల కోసం కనీసం ఆ మూగజీవాలకు రెస్ట్ కూడా ఇవ్వకుండా రాత్రి, పగలు వాటితో పనులు చేయిస్తుంటారు.
జనాలను, సంచులను మోయిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మూగజీవాల హింస మీద ఉత్తరాఖండ్ హైకోర్టులో ఓ పిటిషన్ నమోదైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేదార్ నాథ్ మార్గంలో రాత్రపూట గుర్రాలు, గాడిదల మీద ప్రయాణాన్ని నిషేధించింది.
హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఇక నుంచి వాటిని వినియోగించకూడదు.హైకోర్టు ఆదేశాలతో చార్ ధామ్ బోర్డు, స్థానిక జిల్లా అధికారులు ఆ మేరకు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని టూర్ ఆపరేటర్లు, స్థానిక గుర్రాలు, గాడిదల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్
- అమెరికాలో తూటాకు బలైన తెలంగాణ విద్యార్థి
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం