ఎయిరిండియా మరో ఏడు రూట్లకు ఆఫర్..
- July 12, 2016
ఆఖరినిమిషంలో ప్రయాణాలు కుదుర్చుకున్నవారికి ఎయిర్ఇండియా ప్రకటించిన ఆఫర్‌ను మరో ఏడు రూట్లకు పెంచింది. ప్రస్తుతం దేశ రాజధాని నుంచి నాలుగు నగరాలకు వెళ్లే విమాన సర్వీసులకు ఈ ఆఫర్ కల్పించగా.. తాజాగా హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా సహా ఏడు రూట్లలో ఆఖరినిమిషం టికెట్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ముఖ్యమైన మార్గాల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎయిర్ఇండియా ఇటీవల ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విమానం బయలుదేరే నాలుగు గంటలకు ముందు టికెట్ కొనుగోలు చేసుకునే వారికి రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ2 టైర్ ఛార్జీల కంటే తక్కువకే టిక్కెట్లు విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దిల్లీ నుంచి ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరుకు వెళ్లే సర్వీసులకు ఈ ఆఫర్‌ను కల్పించింది. తాజాగా.. దిల్లీ నుంచి హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా, రాంచీ, భువనేశ్వర్, పట్నా, రాయ్‌పూర్ వెళ్లే విమానాల్లోనూ ఆఖరినిమిషం టికెట్ల సదుపాయం కల్పిస్తోంది.
ఈ ఆఫర్ కింద టికెట్ ధరలు దిల్లీ-హైదరాబాద్ రూ. 3,275, దిల్లీ-అహ్మదాబాద్ రూ. 2,270, దిల్లీ-రాంచీ రూ. 2,770, దిల్లీ-భువనేశ్వర్ రూ. 3,475, దిల్లీ-గోవా రూ. 3,665, దిల్లీ-పట్నా రూ. 2,315, దిల్లీ-రాయ్‌పూర్ రూ. 2,240గా ఉన్నట్లు ఎయిర్ఇండియా తెలిపింది
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







