బంగారం ధర స్వల్పంగా పెరిగింది
- July 12, 2016
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 40 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,890కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరుగుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,356.20 అమెరికన్ డాలర్లుగా ఉంది.
బంగారం దారిలోనే వెండి ధర కూడా నేడు రూ.40 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,770కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువవడంతో గత కొద్ది రోజులుగా వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







