NEET పీజీ పరీక్ష వాయిదా
- June 02, 2025
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష అనూహ్యంగా వాయిదా పడింది.ఈ మేరకు వైద్యశాస్త్ర పరీక్షల జాతీయ బోర్డు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయడానికి గల కారణాలను కూడా బోర్డు వెల్లడించింది.సింగిల్ షిఫ్ట్ లోనే పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి.నీట్ పీజీ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది.అయితే ఎంబీబీఎస్ తో పాటు డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండు షిఫ్ట్ లకు బదులుగా ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కు ఆదేశాలు ఇచ్చింది.
దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సింగిల్ షిఫ్ట్ లో పరీక్ష నిర్వహణ సాధ్యం కాకపోవడంతో బోర్డు ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది.జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షల్లో అక్రమాలపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పారదర్శకత ఉండాలంటే సింగిల్ షిఫ్ట్ లో పరీక్షలు నిర్వహిచాలని సుప్రీంకోర్టు సూచించింది.
అలాగే సురక్షితమైన పరీక్షా కేంద్రాల్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే ఇవాళ పీజీ పరీక్షల్ని వాయిదా వేసింది.సుప్రీంకోర్టు నిర్ణయం అమలు చేయాలంటే పలు సర్దుబాట్లు చేయాల్సి ఉంటుందని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
ఇందులో ముఖ్యంగా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచడం, అభ్యర్థులందరికీ ఒకేసారి వసతి కల్పించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలున్నట్లు పేర్కొంది. కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపింది. త్వరలోనే నీట్ పీజీ పరీక్షల కొత్త తేదీ వెల్లడిస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







