11 మంది మృతి : ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి
- July 12, 2016
ఇరాక్‌లో మళ్లీ ఆత్మాహుతి దాడి జరిగింది. అల్-రషిదియా జిల్లాలో షియా ముస్లింలు అధికంగా ఉండే మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో బాగ్దాద్ సహా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భద్రతాదళాలు మోహరించాయి. గత వారం బాగ్దాద్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెండు సార్లు చేసిన దాడుల్లో సుమారు 300 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం అల్-రషిదియాలోని కూరగాయలు, పండ్ల మార్కెట్లో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారు బాంబును ఉగ్రవాదులు పేల్చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







