ఫేక్ ఆన్లైన్ ప్రకటనల గురించి ప్రజలకు MOI హెచ్చరిక..!!
- June 05, 2025
కువైట్: పౌరులు, నివాసితులు ఫేక్ ఆన్లైన్ ప్రకటనలతో, ముఖ్యంగా మోసపూరిత లింక్‌ల ద్వారా చెల్లింపును అభ్యర్థించే చాలెట్ అద్దెకు సంబంధించిన ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ఒక బహిరంగ హెచ్చరికను జారీ చేసింది. ఆన్లైన్ మోసపూరిత కేసుల పెరుగుదలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
మోసపూరిత వెబ్సైట్లు లేదా అనధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బాధితులను డబ్బు బదిలీ చేయమని ఆకర్షించే నకిలీ చాలెట్ అద్దె ప్రకటనలతో సహా అన్ని ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ధృవీకరించబడని లేదా అనధికారిక లింకులకు దూరంగా ఉండలని సూచించింది. అనుమానాస్పద సందేశాలు లేదా లింక్‌లకు ప్రతిస్పందించవద్దని కోరింది. ఇటువంటి సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే 97283939 అనే ప్రత్యేక హాట్‌లైన్ ద్వారా నివేదించాలని MOI పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







