తొక్కిసలాట ఘటనలో హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్‌ సంఘం

- June 06, 2025 , by Maagulf
తొక్కిసలాట ఘటనలో హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్‌ సంఘం

బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందడం యావత్‌ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఈ ఘటనపై ఆర్‌సీబీ, క‌ర్ణాక‌ట క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ‌ర్లపై కేసు న‌మోదు చేసిన విషయం తెలిసిందే.

రిట్‌ పిటీషన్‌
ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును సవాల్‌ చేస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) హైకోర్టును ఆశ్రయించింది. కేఎస్‌సీఏ అధ్యక్షుడు రఘురామ్‌ భట్‌, కార్యదర్శి ఎ.శంకర్‌, కోశాధికారి ఈఎస్ జయరాం సంయుక్తంగా కర్ణాటక హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. తమపై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వీరి పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com