ఆది సాయి కుమార్ ‘శంబాల’ టీజర్ రిలీజ్..

- June 07, 2025 , by Maagulf
ఆది సాయి కుమార్ ‘శంబాల’ టీజర్ రిలీజ్..

ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. రాజశేఖర్‌ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు.

ఈ టీజర్ చూస్తుంటే పీరియాడిక్ సూపర్ నేచుర్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది.. టీజర్ లో.. ఆకాశం నుంచి ఓ రాయి లాంటి వస్తువు వచ్చి ఓ గ్రామంలో పడిన దగ్గర్నుంచి ఆ గ్రామంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం, మనుషులు చనిపోతుండటం జరుగుతూ ఉంటుంది. ఆ ఊరికి ఆది సాయి కుమార్ వస్తే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు, ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొనేలా చూపించారు. ఇక ఈ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com