ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన టీమ్ఇండియా ప్లేయర్లు..

- June 07, 2025 , by Maagulf
ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన టీమ్ఇండియా ప్లేయర్లు..

లండన్: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‍ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆ దేశంలో అడుగుపెట్టారు. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తరువాత భారత్ జట్టు ఆడనున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కావటం గమనార్హం. ఇంగ్లాండ్‌లో సిరీస్ కోసం శుక్రవారం ముంబై నుంచి బయలుదేరిన టీమిండియా ప్లేయర్లు శనివారం ఉదయం లండన్‌లో అడుగు పెట్టారు.

టీమిండియా ఆటగాళ్లు లండన్‌లో ల్యాండ్ అయిన వీడియోను బీసీసీఐ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, జస్ర్పీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ సహా పలువు యువ ప్లేయర్లు ఉన్నారు. వీరికి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. రిషబ్ పంత్, శుభమన్ గిల్ తోటి ప్లేయర్లను ఆటపట్టిస్తూ సరదాగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంగ్లాండ్ -భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి ఆగస్టు4వ తేదీ వరకు జరగనుంది. తొలి టెస్టు ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుంది. రెండో టెస్టు జులై 2 నుంచి 6 వరకు, మూడో టెస్టు జులై 10 నుంచి 14 వరకు, నాల్గో టెస్టు జులై 23 నుంచి 27వ తేదీ వరకు, ఐదో టెస్టు జులై 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు జరుగుతుంది. ఇప్పటికే భారత్ -ఎ జట్టు ఇంగ్లాండ్ లయన్స్‌తో అనధికార మ్యాచ్ లు ఆడుతుంది.

టీమిండియా స్క్వాడ్..
అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com