సైబర్ భద్రతా ఆవిష్కరణలకు కేంద్రంగా ఖతార్..!!
- June 07, 2025
దోహా, ఖతార్: ఖతార్ GCC అంతటా సైబర్ భద్రతా ఆవిష్కరణలలో తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటం-సేఫ్ ఫ్రేమ్‌వర్క్‌ల వంటి అత్యాధునిక సాంకేతికతలను తన జాతీయ సైబర్ భద్రతా వ్యూహంలో భాగంగా అనుసంధానం చేస్తోంది. PwC మిడిల్ ఈస్ట్‌లోని టెక్నాలజీ కన్సల్టింగ్ భాగస్వామి ఒమర్ షెరిన్ ప్రకారం.. ఖతార్ సైబర్ రక్షణ విభాగం విస్తృతమైన, డిజిటల్ సురక్షిత కేంద్రంగా మారుతోంది. ఖతార్ చాలా కాలంగా GCC ప్రాంతంలో సైబర్ భద్రతలో మార్గదర్శక హోదాలో ఉందని షెరిన్ తెలిపింది. 2010లో నేషనల్ ఇన్ఫర్మేషన్ అస్యూరెన్స్ స్టాండర్డ్‌ను జారీ చేసిన మొదటి దేశాలలో ఇది ఒకటని, తరువాత 2011లో క్లౌడ్ సెక్యూరిటీ స్టాండర్డ్‌ను , 2020లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసిందన్నారు.
ఖతార్ తాజా నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ (2024–2030) భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) 2024లో సురక్షితమైన AI అడాప్షన్ కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది AI ప్రయాణాన్ని ప్రారంభించే సంస్థలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది.
ఖతార్‌లో స్మార్ట్ సిటీలు, ఇండస్ట్రీ 4.0 చొరవల పెరుగుదల కూడా ఎడ్జ్ కంప్యూటింగ్ భద్రత వృద్ధిని పెంచుతోందని పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలు, పురోగతులకు అనుగుణంగా ఉండటానికి ఇటీవల ప్రపంచ AI సమ్మిట్‌ను నిర్వహించడంతో సహా, సాంకేతిక ఆవిష్కరణలలో ఖతార్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని షెరిన్ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







