జూన్ 8 నుండి భారతీయులు.. వీసా లేకుండా ఫిలిప్పీన్స్‌లోకి ప్రవేశించవచ్చు..!!
- June 08, 2025
యూఏఈ: ఇండియన్స్ కు ఫిలిప్పీన్స్ వీసా ఫ్రీ ప్రవేశం ఈ జూన్ 8 నుంచి అమల్లోకి రానుంది. పర్యాటక ప్రయోజనాల కోసం భారతీయులు 14 రోజుల కోసం వీసా లేకుండానే ప్రవేశించవచ్చని దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ ప్రకటించారు.
అలాగే, చెల్లుబాటు అయ్యే అమెరికన్, జపనీస్, ఆస్ట్రేలియన్, కెనడియన్, స్కెంజెన్, సింగపూర్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్ (AJACSSUK) వీసాలు లేదా నివాస అనుమతులు కలిగి ఉన్న భారతీయ పౌరులకు 30 రోజుల చెల్లుబాటు అయ్యే వీసా లేకుండా ఫిలిప్పీన్స్‌లో ఉండవచ్చు.
14-రోజుల వీసా-రహిత ప్రవేశాన్ని ఎలా పొందాలి?
భారతీయులు కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌ను సమర్పించాలి. హోటల్ వసతి లేదా బుకింగ్, ఆర్థిక సామర్థ్యం రుజువు, తదుపరి గమ్యస్థాన దేశానికి తిరిగి లేదా తదుపరి దేశానికి సబంధించిన ఫ్లైట్ టికెట్ కూడా అవసరం. అవసరమైన పత్రాలతో ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







