బెంగళూరు: సూట్‌కేసులో బాలిక మృతదేహం కేసు..

- June 08, 2025 , by Maagulf
బెంగళూరు: సూట్‌కేసులో బాలిక మృతదేహం కేసు..

బెంగళూరు: బెంగళూరులో 17 ఏళ్ల బాలిక మృతదేహం దొరికిన ఘటనలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. మే 21న చందాపురలోని రైల్వే ట్రాక్‌ పక్కన బ్లూ సూట్‌కేసులో మృతదేహం లభించింది. ఈ కేసును ఛేదించే దిశగా సీసీటీవీ ఆధారాలు కీలకమవుతున్నాయి.రాత్రి 11.51కి ఇద్దరు వ్యక్తులు నిర్మానుష్య వీధిలో సూట్‌కేసు మోస్తూ వెళ్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. వారిలో ఒకరు మరలా వెనక్కు తిరిగి వచ్చి చెట్టు వెనకాల ఏదైనా దాచినట్టు కనిపించారు. ఆ తర్వాత వారు మళ్లీ కలుసుకుని, సూట్‌కేసుతో రైల్వే ట్రాక్ వైపు వెళ్లినట్టు మరో ఫుటేజీలో కనిపించింది.

బీహార్‌కు చెందిన ఏడుగురి అరెస్ట్
ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.సూర్యానగర్ పోలీసులు బీహార్‌కు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా నవాడా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు ఆశిక్ కుమార్‌కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.

హత్యను ఇతర ప్రాంతంలో చేసి ఇక్కడ పడేశారా?
ఇంటిగానే బాలికను హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి రైల్వే ట్రాక్ వద్ద పడేసినట్టు మొదట అనుమానించారు. కానీ, ఇప్పుడు మృతదేహం ఉన్న సూట్‌కేసును క్యాబ్‌ ద్వారా తీసుకువచ్చి ట్రాక్‌ వద్ద వదిలేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.బాలిక ఎవరు? ఆమెకు నిందితులతో సంబంధం ఏంటి? హత్యకు కారణం ఏమిటి? ఇవన్నీ ఇంకా గుర్తించాల్సిన అంశాలే. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా, సీసీటీవీ ఆధారాలు విచారణకు నూతన దారులు చూపిస్తున్నాయి. నిజం వెలుగులోకి వచ్చే వరకు ఈ కేసు మరింత ఉత్కంఠనిప్రదంగా మారే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com