‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తి

- June 08, 2025 , by Maagulf
‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తి

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీం అందరూ సెట్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.
 
సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్.

విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తారాగణం: కార్తి, ఎస్ జె సూర్య, మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: పిఎస్ మిత్రన్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎ వెంకటేష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
డీవోపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నంబియార్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పాండి
పీఆర్వో: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com