వెదర్ అలెర్ట్..3 ఎమిరేట్స్‌లో భారీ వర్షాలు..!!
- June 09, 2025
యూఏఈ: వివిధ ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షపాతం కురిసింది. ఇది ఈద్ సెలవుదిన ఆనందాన్ని మరింత పెంచింది. ఫుజైరాలోని వాడి అల్ సిదర్తో సహా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) నివేదించింది. రస్ అల్ ఖైమాలోని మసాఫీ, షార్జాలోని ఖోర్ ఫక్కన్ రోడ్.. వాడి షీస్లలో కూడా కొన్ని వర్షాలు కురిశాయి. ఎల్లో, ఆరేంజ్ హెచ్చరికలు జారీ చేశారు. వివిధ ప్రాంతాలలో వర్షపాతం కారణంగా వాడీలు పొంగిపొర్లుతున్నాయి. పర్వత ప్రాంతాలలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. జూన్ 21న వేసవి కాలం ప్రారంభం కావడానికి ముందే క్రమంగా పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి ఈ వర్షపాతం నివాసితులకు ఉపశమనం కలిగించాయి.
వర్షాకాలంలో వాహనదారులకు NCM అలెర్జ్ జారీ చేసింది. అవసరమైతే మాత్రమే వాహనాలు నడపాలని, జాగ్రత్తగా ఉండాలని, విజిబిలిటీ తగ్గినప్పుడు తక్కువ-బీమ్ హెడ్లైట్లను ఆన్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







