నీ ఈ ప్రాణం

- June 09, 2025 , by Maagulf
నీ ఈ ప్రాణం

ఎక్కడెక్కడ ఏరూపంలో దాగివున్నావో                                                                                          ఏనాడు కానరావు అంతటా నేనేనన్నావు                                                                              ఎత్తైన గగనాన మెరిసే తారకవా అభిసారికవా                                                                      ఎక్కడ ఉన్నా అనునిత్యం ఉక్కిరిబిక్కిరి చేసేవు...

ఎవేవో  తలపుల్లో దర్శనమిచ్చేవు
ఏకవి కవనానికి సైతము అందని అక్షరానివా
ఎన్నో ఆశలు ఆశయాలతో అన్వేషించినా కానరావే

ఏదో తెలపాలని క్షణక్షణం తపన పడిన 
ఏవో ఆశలతో ఏ సడి చేయక 
ఎదుట లేకున్నా ఎప్పటికైనా నీ మనసున నేనేననిన...

ఏవో చెరగని గురుతులు మదిలో ముద్రించిన 
ఎన్ని జన్మలకైనా నీ శ్వాసలో శ్వాసగా నిలవాలని
ఎన్నో మధురమైన జ్ఞాపకాలు సజీవమేనని
ఏది నీది ఏది నాది నాదో లోకం నీదో లోకం కాదనిన ...

ఎదురుచూపుల ఏకాంతంలో ఎంతకాలమైనా 
ఎన్నో ఆశనిరాశలతో ఎన్ని పరీక్షలైనా
ఏ నిర్లిప్తత ఆవహించిన వేచి చూచే నీ ఈ ప్రాణం...

--యామిని కోళ్ళూరు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com