యాత్రికుల తిరిగి వెళ్లేందుకు విస్తృత ఏర్పాట్లు: పాస్‌పోర్ట్స్ డైరెక్టరేట్

- June 10, 2025 , by Maagulf
యాత్రికుల తిరిగి వెళ్లేందుకు విస్తృత ఏర్పాట్లు: పాస్‌పోర్ట్స్ డైరెక్టరేట్

మక్కా: హజ్ కోసం వచ్చిన యాత్రికులు తిరిగి క్షేమంగా వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాస్‌పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఆధునిక భద్రతా వ్యవస్థల మద్దతుతో తమ సిబ్బందిని, టెక్నాలజీని సన్నద్ధం చేసినట్లు డైరెక్టరేట్ పేర్కొంది.

మరోవైపు, ఈ సంవత్సరం హజ్ చేసిన తర్వాత ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వదేశాలకు తిరిగి వెళ్లే యాత్రికులను ఆహ్వానించడం ప్రారంభించాయి.కాగా, హజ్ చేసిన తర్వాత, పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రవక్త మసీదులో ప్రార్థన చేయడానికి మదీనాకు చేరుకుంటున్నారు.  ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలోని హజ్, విజిట్ కమిటీ, సంబంధిత సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి.  

మొత్తంగా ఎయిర్స్ పోర్ట్స్ ద్వారా 719,400 మంది యాత్రికులు రాగా.. అలాగే  రాజ్యానికి ఫ్లైట్స్ ద్వారా వచ్చే యాత్రికులలో వీరిది 49 శాతంగా ఉంది. ఈ యాత్రికులు ఏప్రిల్ 29 నుండి 65 విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 53 దేశాలలోని 196 నగరాల నుండి 1,910 విమానాలలో వచ్చారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com