E311లో స్కూల్ బస్సులు ఢీ..13aకు పెరిగిన గాయపడ్డ స్టూడెంట్స్ సంఖ్య..!!

- June 10, 2025 , by Maagulf
E311లో స్కూల్ బస్సులు ఢీ..13aకు పెరిగిన గాయపడ్డ స్టూడెంట్స్ సంఖ్య..!!

యూఏఈ: ఈద్ అల్ అధా సెలవుల తర్వాత విద్యార్థులు పాఠశాలకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు రెండు స్కూల్ బస్సులు ఢీకొన్నాయి. ఇందులో 13 మంది విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి E311 పై జరిగింది. జూన్ 9న మధ్యాహ్నం 3.11 గంటలకు ఈ సంఘటన గురించి అత్యవసర కాల్ అందిందని నేషనల్ అంబులెన్స్ తెలిపింది. అత్యవసర వైద్య బృందాలు 13 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. గాయపడిన విద్యార్థులు 6 -12 సంవత్సరాల మధ్య వయస్సు వారని తెలిపారు.   

వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, వేగాన్ని నివారించాలని కోరారు. తీవ్రమైన ఉల్లంఘనలకు Dh200,000 వరకు జరిమానాతో కఠినమైన శిక్షలు అమలులో ఉన్నాయని గుర్తుచేశారు.

కాగా, దుబాయ్‌లో పాఠశాల బస్సు ఆపరేటర్లు, రవాణా సంస్థలు విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి డ్రైవర్లకు సమగ్ర శిక్షణ అందించడం తప్పనిసరి. షార్జాలో తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలకు తిరిగి వెళ్లేటప్పుడు వారిని పర్యవేక్షించడానికి వీలుగా 2,000 బస్సులలో కెమెరాలు, భద్రతా పరికరాలను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com