రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్ హాసన్

- June 10, 2025 , by Maagulf
రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్ హాసన్

చెన్నై: త‌మిళ‌నాడు : తమిళ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 6 స్థానాలకు గాను 4 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు డిఎంకే ప్రకటించింది.

ఒక స్థానాన్ని మిత్రపక్షమైన MNM కు కేటాయించగా.. కమల్ ఆ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే కమల్ హాసన్ తో పాటు మిగిలిన డీఎంకే సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. కాగా రాజ్యసభలోకి కమల్ ఎంట్రీతో MNM పార్టీకి మరింత రాజకీయ ప్రాధాన్యత పెరగనుంది. అలాగే తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు పెద్దల సభలో తమిళ గళాన్ని మరింత గట్టిగా వినిపించేందుకు DMK-MNM సిద్ధమ‌వుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com