కువైట్‌లో మూడు రోజులపాటు డస్టీ విండ్స్..!!
- June 11, 2025
కువైట్: కువైట్ లో రాబోయే మూడు రోజులపాటు దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో అధిక తేమ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపారు. వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ ధరర్ అల్-అలీ మాట్లాడుతూ.. దేశం ఉపరితల అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో వేడి, తేమతో కూడిన గాలులు గంటకు 50 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వీస్తాయని అన్నారు. అర్ధరాత్రి వరకు గాలులు కొనసాగుతాయని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో విజిబిలిటీ తగ్గిస్తుందని, సముద్ర అలలు ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఉంటాయని సూచించారు. మరోవైపు పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 39°C - 43°C మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 28°C నుండి 30°C వరకు ఉంటాయని అంచనా వేశారు. తాజా వాతావరణ హెచ్చరికల కోసం డిపార్ట్‌మెంట్ అధికారిక ప్లాట్‌ఫారమ్‌లు, ప్రభుత్వ "సాహ్ల్" యాప్ ద్వారా తెలసుకోవాలని అల్-అలీ కోరారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!