బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు..

- June 11, 2025 , by Maagulf
బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు..

హైదరాబాద్: ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ పుట్టి రోజు వేడుక‌ల్లో గంజాయి క‌ల‌క‌లం రేగింది.ఈ వేడుక‌ల్లో భారీగా గంజాయి, విదేశీ మ‌ద్యాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీకి హాజ‌రైన ప‌లువురికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా డ్ర‌గ్స్ పాజిటివ్‌గా తేలిన‌ట్లు స‌మాచారం.

సింగ‌ర్ మంగ్లీ పుట్టి రోజు జూన్ 10. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఆమె చేవెళ్ల‌లోని త్రిపుర రిసార్టులో బ‌ర్త్ డే పార్టీని ఇచ్చింది. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారు మొత్తం 48 మంది వ‌ర‌కు ఈ పార్టీకి హాజ‌రు అయ్యార‌ని తెలుస్తోంది. ఈ రిసార్టు పై అర్థ‌రాత్రి రెండు గంట‌ల త‌రువాత ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వ‌హించారు.

ఈ దాడుల్లో 48 మందికి గంజాయి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 9 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో ఎన్‌డీపీఎస్ యాక్ట్‌, సౌండ్ పొల్యూష‌న్ యాక్ట్ కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

గంజాయి తీసుకుంటూ దామోదర్ అనే వ్య‌క్తి ప‌ట్టుబ‌డిన‌ట్లుగా తెలుస్తోంది. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీని నిర్వ‌హించ‌డం, గంజాయి, విదేశీ మ‌ద్యం దొర‌క‌డంతో ఫోక్ సింగర్ మంగ్లీ, త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ ల పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డిజే ను పోలీసులు సీజ్ చేశారు.

మంగ్లీ బ‌ర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ త‌దిత‌రులు పాల్గొన్న‌ట్లుగా తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com