ఏపీ: ప్రైవేటు జాబ్‌లో కొత్త సిస్టం..

- June 11, 2025 , by Maagulf
ఏపీ: ప్రైవేటు జాబ్‌లో కొత్త సిస్టం..

వెలగపూడి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పరిశ్రమల పని గంటలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇక పై ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు పది గంటలు పని చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం కార్మిక చట్టాల్లో భారీ మార్పులు చేపట్టింది. సవరించిన ‘ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టం’ ప్రకారం ఇప్పటి వరకు 9 గంటలు పని చేసిన ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాల్సి ఉంటుంది.

కార్మిక చ‌ట్టంలోని సెక్ష‌న్ 54లో మార్పులు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు పని చేయడానికి పరిమితి ఉండేది. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెట్టుబడులు భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటి. మ్యాన్‌పవర్ అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటలు కూడా 10 గంటలు చేస్తే పరిశ్రమలు వచ్చేందుకు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పదేళ్ల క్రితం 8 గంటలుగా ఉన్న వర్కింగ్ అవర్స్‌ను 9 గంటలకుపెంచారు. ఇప్పుడు సెక్షన్ 54 కింద మార్పులు చేర్పులు చేసి 10 గంటలు చేశారు.దీనితో పాటు సెక్షన్ 55లో కూడా సవరణలు చేశారు.మొదట ఐదు గంటల పని తర్వాత అరగంట విరామం తప్పనిసరిగా ఉండేది, దీన్ని ఇప్పుడు ఆరు గంటల పని తర్వాత ఒక గంట విరామంగా మార్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com