ఫుజైరాలో ఢీకొన్న 20 కార్లు, ట్రక్కులు.. 9 మందికి గాయాలు..!!

- June 12, 2025 , by Maagulf
ఫుజైరాలో ఢీకొన్న 20 కార్లు, ట్రక్కులు.. 9 మందికి గాయాలు..!!

యూఏఈ: వైబ్ అల్ హన్నా నుండి దిబ్బా అల్ ఫుజైరాకు వెళ్లే రోడ్డుపై 20 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 16 వాహనాలు, నాలుగు ట్రక్కులు ఉన్నాయి. దాంతో ఆ రోడ్డుపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దిబ్బా అల్ ఫుజైరా పోలీసులు, ట్రాఫిక్ పెట్రోల్స్ విభాగం, మసాఫీ సమగ్ర పోలీస్ స్టేషన్, నేషనల్ అంబులెన్స్ నుండి అత్యవసర బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మందికి స్వల్ప గాయాలు కాగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఫుజైరా పోలీస్ జనరల్ కమాండ్.. డ్రైవర్లు తీవ్ర జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్దేశిత వేగ పరిమితులను పాటించాలని, సురక్షితమైన దూరాన్ని నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా హిల్స్ రోడ్లు లేదా రద్దీ ప్రాంతాలలో వెళ్ళే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇటీవల స్కూలు బస్సు ప్రమాదాలు:
జూన్ 9న రెండు పాఠశాల బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 13 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు . ఈ సంఘటన జాతీయ రహదారి E311 వెంబడి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది.
జూన్ 10న అజ్మాన్ పోలీసులు రెండు స్కూల్ బస్సులు ఢీకొన్న ఒక చిన్న ప్రమాదం గురించి నివేదించారు.దీని వలన విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. ఈ ప్రమాదం అల్ మోవైహత్ ప్రాంతంలో జరిగింది.

6 మరణాలు, 137 ప్రమాదాలు:
షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311) వెంబడి ట్రక్కుల వల్ల ఏర్పడిన ట్రాఫిక్ రద్దీ కారణంగా జనవరి నుండి ఇప్పటి వరకు జరిగిన 137 ప్రమాదాలలో ఆరుగురు మరణించారు.
 
2024లో 384 రోడ్డు మరణాలు:
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) 'ఓపెన్ డేటా' ప్రకారం.. గత సంవత్సరం మొత్తం 384 రోడ్డు మరణాలు నమోదయ్యాయి. ఇది 2023లో 352 మరణాలతో పోలిస్తే 32 కేసులు లేదా 9 శాతం అధికం. ఇది 2022లో నమోదైన 343 కంటే 12 శాతం ఎక్కువ లేదా 41 శాతం అధికం కావడం గమనార్హం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com