జాతీయ మాన్‌సూన్‌ టోర్నీలో సత్తాచాటిన రవికుమార్‌

- June 12, 2025 , by Maagulf
జాతీయ మాన్‌సూన్‌ టోర్నీలో సత్తాచాటిన రవికుమార్‌

హైదరాబాద్: జాతీయ మాన్‌సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌ హైదరాబాద్‌ హుసేన్‌సాగర్‌ వేదికగా జరుగుతోంది.ఈ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ సెయిలర్‌ రవికుమార్‌ బన్నెవోలు సత్తాచాటాడు.బుధవారం జరిగిన బాలుర అండర్‌-15 అప్టిమిస్టిక్‌ ఫ్లీట్‌లో బరిలోకి దిగిన రవికుమార్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.రసూల్‌పురాలోని ఉద్బవ్‌ స్కూల్‌లో చదువుతున్న రవికి తొలుత మెరుగైన ఆరంభం దక్కినప్పటికీ ఆరో స్థానానికి పడిపోయాడు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన యువ సెయిలర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, రవికుమార్ తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో పలు పోటీల్లో విజేతగా నిలిచిన రవికుమార్‌కు ఈ రెగెట్టా ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ పోటీలో ప్రారంభంలోనే మంచి జోష్‌తో సాగిన అతని ప్రయాణం మధ్యలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, చివరకు ఆరో స్థానాన్ని దక్కించుకుని మన్ననలు పొందాడు.ఆదిలోనే సముద్రపు గాలుల దిశను అంచనా వేసుకుంటూ, తన బోటును చక్కగా నడిపిన రవికుమార్ మిగతా పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చాడు. తొలి రెండు రౌండ్లలో అతను మూడో స్థానం వరకు చేరి ఆకట్టుకున్నాడు. అయితే మూడవ రౌండ్ నుంచి గాలుల మార్పులు, నీటి ప్రవాహ ప్రభావంతో కొంత వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ, అతని పట్టుదల, స్థిరత్వం, బోటును నియంత్రించే నైపుణ్యం వీటితో ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు.

తారా అనాథ ఆశ్రమానికి చెందిన నవీన్‌ను వెనక్కి నెడుతూ టాప్‌లో నిలిచాడు. బాలికల అండర్‌-15 విభాగంలో తమిళనాడు యువ సెయిలర్‌ శ్రేయకృష్ణ ఒక దశలో 9వ స్థానానికి పడిపోయినా,అద్భుతంగా పుంజుకుని అగ్రస్థానంలోకి రాగా, లాహిరి(తెలంగాణ) రెండో స్థానంలో ఉంది. బాలుర సబ్‌జూనియర్‌ కేటగిరీలో తెలంగాణకు చెందిన రిజ్వాన్‌ మహమ్మద్‌ టాప్‌లో దూసుకెళుతున్నాడు. మలేషియాలో ఈనెల 16 నుంచి మొదలయ్యే యూత్‌ ఇంటర్నేషనల్‌ సెయిలింగ్‌ టోర్నీకి హైదరాబాద్‌ నుంచి 10 సెయిలర్లు ఎంపికయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com